Nagasourya: నాగశౌర్య 24వ సినిమా ఎవరితోనంటే .. !

  • నాగశౌర్య 24వ సినిమా ప్రకటన
  • వైష్ణవీ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాణం  
  • దర్శకుడిగా అరుణాచలం
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలు    
Nagashourya 24 th movie update

నాగశౌర్యకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. లవర్ బాయ్ గా అమ్మాయిల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన యాక్షన్ సినిమాలు చేసి దెబ్బతిన్నాడు. మళ్లీ ట్రాక్ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక వైపున బయట సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. 

అలా అతను చేస్తున్న రెండు మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతను మరో ప్రాజెక్టును సెట్ చేశాడు. వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్లో ఆయన ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాకి శ్రీనివాసరావు ... విజయ్ కుమార్ .. అశోక్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి అరుణాచలం దర్శకత్వం వహించనున్నాడు. 

కెరియర్ పరంగా నాగశౌర్యకి ఇది 24వ సినిమా. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. టైటిల్ తో పాటు హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడించనున్నారు. వచ్చే ఏడాదిలోనైనా నాగశౌర్యకి మంచి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News