Andhra Pradesh: ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి

posani krishna murali appointed as chairman of ap film development corporation
  • 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన పోసాని
  • జగన్ ను సమర్ధిస్తున్న వారిలో కీలక నేతగా గుర్తింపు
  • అలీకి పదవి దక్కిన రోజుల వ్యవధిలోనే పోసానికి పదవి
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గురువారం మరో కీలక పదవిని భర్తీ చేసింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, కథా రచయిత పోసాని కృష్ణ మురళిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 

గత వారం హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. అలీ నియామకం జరిగిన రోజుల వ్యవధిలోనే పోసానికి కూడా కీలక పదవిని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలీ మాదిరే పోసాని కూడా 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. వైసీపీ వాదనతో పాటు సీఎం జగన్ వాదనలను బలంగా సమర్ధిస్తూ వస్తున్న పోసానికి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి దక్కడం గమనార్హం.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Posani Krishna Murali
Ap Film Development Corporation

More Telugu News