థియేటర్ లో కాంతారా సినిమా చూసిన కేంద్రమంత్రి

  • చాలా బాగుందంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్
  • శ్రేయోభిలాషులతో దిగిన ఫొటోను షేర్ చేసిన మంత్రి
  • ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూలు చేసిన సినిమా
  • తెలుగులో రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు
central minister watched kantara movie in bengalore theatre

రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న‘కాంతారా’పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ ట్వీట్ చేశారు. బెంగళూరులో తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్ లో కాంతారా సినిమా చూసినట్లు వెల్లడించారు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందని మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను చాలా బాగా చిత్రీకరించారని అన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్‌ చేశారు.

మరోపక్క, ప్రాంతాలు, భాషలకు అతీతంగా కాంతారా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కాంతారా కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తోంది. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది.

More Telugu News