asembly election: డిసెంబర్ 1, 5 తేదీల్లో.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

Gujarath election schedule released
  • ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
  • రెండు విడతల్లో పోలింగ్ నిర్వహణ
  • డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, 10 న ఫలితాలు
గుజరాత్ లో వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో.. డిసెంబర్ 1, 5 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 51 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం గుజరాత్ లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4.61 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారని మీడియా సమావేశంలో సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు. అంతకుముందు, మోర్బీ వంతెన మృతులకు అధికారులు సంతాపం వ్యక్తంచేశారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు.

ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపడతామని సీఈసీ రాజ్ కుమార్ చెప్పారు. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా వచ్చే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
asembly election
Gujarat election
cec
Gujarat polls
Himachal Pradesh

More Telugu News