Team India: అడిలైడ్ లో శాంతించిన వరుణుడు... బంగ్లాదేశ్ లక్ష్యం కుదింపు

  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన భారత్
  • బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం
  • అప్పటికి బంగ్లా స్కోరు 7 ఓవర్లలో 66 పరుగులు
  • 16 ఓవర్లలో 151 పరుగులకు లక్ష్యం సవరించిన అంపైర్లు
Team India and Bangladesh match restart

అడిలైడ్ లో వర్షం తగ్గడంతో టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ మళ్లీ మొదలైంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేయడం తెలిసిందే. కొత్త లక్ష్యం ప్రకారం ఆ జట్టు 54 బంతుల్లో 85 పరుగులు చేయాలి. 

అయితే, ఆట పునఃప్రారంభమైన కాసేపటికే దూకుడు మీదున్న బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ (60) రనౌట్ అయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత షమీ బౌలింగ్ లో మరో ఓపెనర్ శాంటో (21) కూడా వెనుదిరిగాడు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 88 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 36 బంతుల్లో 63 పరుగులు చేయాలి. కాగా, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News