Team India: వర్షంతో అడిలైడ్ లో ఆగిన మ్యాచ్... డీఆర్ఎస్ సమీకరణం బంగ్లాదేశ్ కే అనుకూలం

  • టీ20 వరల్డ్ కప్ ను వీడని వరుణుడు
  • దూకుడుగా ఆడుతున్న బంగ్లాదేశ్
  • బంగ్లాదేశ్ విజయలక్ష్యం 185 పరుగులు
  • 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసిన బంగ్లా
  • మ్యాచ్ పూర్తిగా ఆగిపోతే బంగ్లాదేశ్ గెలిచే చాన్స్
Rain stops Team India and Bangladesh match

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో వరుణుడు మరోసారి ప్రత్యక్షమయ్యాడు. టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అడిలైడ్ లో వర్షం పడడంతో పోరు నిలిచిపోయింది. ఆట ఆగిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు టీమిండియా 185 పరుగుల టార్గెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోతే డీఆర్ఎస్ విధానంలో బంగ్లాదేశ్ జట్టే విజేతగా నిలుస్తుంది. మ్యాచ్ ఆగిపోయిన సమయానికి డీఆర్ఎస్ సమీకరణం ప్రకారం బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 49 పరుగులు చేస్తే చాలు. అయితే ఆ జట్టు నిర్దేశిత పరుగులకు 17 పరుగులు ఎక్కువే చేసింది. 

భారీ స్కోరు చేజింగ్ లో బంగ్లాదేశ్ జట్టు ఓపెనర్ లిట్టన్ దాస్ వన్ మ్యాన్ షో చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో ఉన్న నజ్ముల్ హుస్సేన్ శాంటో 7 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ ఓపెనింగ్ జోడీపై టీమిండియా బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

More Telugu News