Electric Lines: అనంతపురం జిల్లాలో విషాద ఘటన... విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

six people died due to electrocution in Ananatapur district
  • పంట కోతలకు వచ్చిన కూలీలు
  • తెగిపడిన విద్యుత్ మెయిన్ లైన్ తీగలు
  • విగతజీవులుగా మారిన కూలీలు
  • శోకసంద్రంలా ఘటనాస్థలి
  • బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో ఘటన
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు పంట కోత పనుల్లో ఉండగా, వారిపై విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడ్డాయి. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో ఈ ఘటన జరిగింది. 

వర్షం వస్తుండగా ఇక ఇంటికి పోదాం అని కూలీలు భావించిన కాసేపట్లోనే ఈ ఘోరం జరిగిందని దర్గాహొన్నూరు మాజీ సర్పంచ్ ముక్కన్న వెల్లడించారు. ఘటన స్థలం మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. తమ వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేస్తోంది.
Electric Lines
Death
Farming Workers
Darga Honnuru
Anantapur District

More Telugu News