T20 World Cup: బంగ్లాతో​ మ్యాచ్ లో భారత్ కు ఆదిలోనే దెబ్బ.. కెప్టెన్ రోహిత్​ 2 పరుగులకే ఔట్

  •  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • ఓపెనర్ గా వచ్చి రోహిత్ నాలుగో ఓవర్లోనే ఔట్
  • ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్
Rohit sharma fails again out for two runs against Bangladesh

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ లో బంగ్లాదేశ్ తో భారత్ కీలక మ్యాచ్ లో తలపడుతోంది. సూపర్12 రౌండ్, గ్రూప్2లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ కోల్పోయాడు. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, భారత్ బ్యాటింగ్ కు దిగింది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టును మార్చింది. గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ స్థానంలో అదనపు బ్యాటర్ గా దీపక్ హుడా ను ఆడించిన మేనేజ్ మెంట్ ఈ పోరులో అతనిపై వేటు వేసింది. హుడా స్థానంలో తిరిగి అక్షర్ పటేల్ ను తుది జట్టులోకి తీసుకుంది.

 ఇక, దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్ లో వెన్ను నొప్పికి గురైన సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కోలుకున్నాడు. దాంతో, అతడిని జట్టులో కొనసాగించింది. అతని స్థానంలో తుది జట్టులోకి రావాలని ఆశించిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యాడు.


 మరో వైపు బ్యాటింగ్ లో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా నిరాశ పరిచాడు. కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అతను రెండు పరుగులకే వికెట్ పారేసుకున్నాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొన్న రోహిత్.. హసన్ మహ్మూద్ వేసిన నాలుగో ఓవర్లో యాసిర్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరంభంలోనే రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి టచ్ లోకి వచ్చాడు.

More Telugu News