Vi Max: డేటా ఎక్కువ కోరుకునే వారి కోసం వొడాఫోన్ కొత్త ప్లాన్లు

Vi Max postpaid plans with more internet data Prime and Hotstar benefits launched in India
  • మూడు రకాల ప్లాన్ల ఆవిష్కరణ
  • డేటా పరంగా వ్యత్యాసం
  • రూ.701 ప్లాన్ లో అయితే డేటా కూడా అపరిమితంగా ఉచితమే
పరిమితి లేకుండా అధిక డేటా కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని వొడాఫోన్ ఐడియా వీఐ మ్యాక్స్ పేరిట కొన్ని కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. 

రూ.401 ప్లాన్
ఈ ప్లాన్ లో 50 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా 200 జీబీ రోలోవర్ డేటా కూడా ఉంటుంది. రాత్రి సమయాల్లో అపరిమితంగా డేటాను పొందొచ్చు. ఉచితంగా సోనీ లివ్ సబ్ స్క్రిప్షన్ 12 నెలల పాటు వస్తుంది. 1,000 వరకు వీఐ గేమ్స్ ఉచితం. వీఐ మూవీస్ కూడా ఉచితమే. హంగామా మ్యూజిక్ ను వీఐ యాప్ పై పొందొచ్చు. 

రూ.501 ప్లాన్
ఇందులో ప్రతి నెలా రూ.501 చార్జ్ పడుతుంది. కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. 90 జీబీ డేటా ప్రతినెలా లభిస్తుంది. రాత్రిపూట అదనంగా డేటా ప్రయోజనాలు అందుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్, వీఐ మూవీస్, టీవీ లో గేమ్స్, మ్యూజిక్ ఉచితం.

రూ.701 ప్లాన్
ఇందులో డేటా, కాల్స్ ఉచితమే. కేవలం నెలవారీగా ఈ మేరకు చెల్లిస్తే సరిపోతుంది. డేటా యూజర్లకు ఈ ప్లాన్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, వీఐ మూవీస్, టీవీ, మ్యూజిక్, గేమ్స్ ఉచితం. ఇక ఈ ప్లాన్లలో ప్రతి నెలా 3,000 ఎస్ఎంఎస్ ల కోటా అమలవుతుంది.
Vi Max
vodafone Idea
new post paid plans
announced

More Telugu News