సగం ధరకే రెడ్ మీ స్మార్ట్ ఫోన్స్.. ఎక్కడంటే..!
- క్లియరెన్స్ సేల్ నిర్వహిస్తున్న ఎంఐ కంపెనీ
- రూ. 3999కే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో
- క్లియరెన్స్ సేల్ లో కొన్న వాటికీ వ్యారంటీ ఇవ్వని ఎంఐ
బడ్జెట్ ఫోన్ అయిన రెడ్ మీ 6ఏ మోడల్ ను ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఆ బ్రాండ్ ప్రారంభ ధర రూ.6,999 కాగా.. క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. రెడ్ మీ 6ఏ అనేది చాలా ప్రాథమిక ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ బడ్జెట్ స్మార్ట్ఫోన్. 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ ఉంటుంది. మిగతా మోడళ్లను కూడా తక్కువ ధరకే ఎంఐ అమ్మకానికి పెట్టింది. అయితే, క్లియరెన్స్ సేల్ లో డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తున్న స్మార్ట్ ఫోన్ లకు ఎలాంటి వారంటీ ఉండదు. క్లియరెన్స్ సేల్ లో ఫోన్లు కొనాలనుకునే వాళ్లు ఎంపై అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.