ఏపీ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. వివరాలివిగో

  • బ్రాండ్ మేనేజర్ పోస్టుల భర్తీ చేపట్టిన బ్యాంకు
  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కనీస అర్హత
  • బ్యాంకింగ్ రంగంలో 12 ఏళ్ల అనుభవం తప్పనిసరి
job recrutment in apcob

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు (ఆప్కాబ్) ఖాళీల భర్తీకి తాజాగా ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని బ్యాంకులో వివిధ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆప్కాబ్ శాఖలలో బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను మేనేజింగ్ డైరెక్టర్, ది ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ సహకార భవన్, డి.నం. 27-29-28, గవర్నర్‌పేట్, విజయవాడ అడ్రస్‌కు పంపించాలని తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు 07-11-2022ని చివరి తేదీగా నిర్ణయించింది.

ఉద్యోగ ఖాళీలు..
బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టులు

అర్హతలు..
అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సీఏఐఐబీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే బ్యాంకింగ్ రంగంలో 12 ఏళ్ల పని అనుభవం తప్పనిసరి.

వయసు..
01-11-2022 నాటికి కనీసం 40 ఏళ్లకు తగ్గకుండా, 70 ఏళ్లకు దాటకుండా ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 75,000 జీతంగా చెల్లిస్తారు.

More Telugu News