iPhone: ఐఫోన్ ఎస్ఈ 4 గురించి మరికొన్ని వివరాలు లీక్

iPhone SE 4 fresh details leaked specs
  • స్క్రీన్ సైజు 5.7-6.1 అంగుళాలు
  • ఓఎల్ఈడీ ప్యానెల్ ప్రత్యేక ఆకర్షణ
  • పవర్ బటన్ వద్ద ఫింగర్ ప్రింట్ సెన్సార్
కొంచెం తక్కువ ధరలో భారత వినియోగదారుల కోసం యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ ను తీసుకువస్తుందన్న సమాచారం కొంత కాలంగా ప్రచారంలో ఉంది. విడుదల విషయం తెలియదు కానీ, ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించి కొన్ని వివరాలు లీకయ్యాయి.

ఈ ఫోన్ లో 6.1 అంగుళాల స్క్రీన్ ఉంటుందని గతంలో అంచనాలు వెలువడ్డాయి. కానీ, డిస్ ప్లే సైజు 5.7 అంగుళాలు లేదంటే 6.1 అంగుళాలతో ఉండొచ్చన్నది తాజా సమాచారం. ఇప్పటి వరకు ఉన్న ఎల్ సీడీ డిస్ ప్లేల స్థానంలో ఓఎల్ఈడీ ప్యానెల్ తో ఎస్ఈ 4 ఉంటుందని తెలుస్తోంది. నాచ్ డిస్ ప్లేతో ఉండొచ్చని అంచనా. మొదటిసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పవర్ బటన్ వద్ద ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది విడుదల అవుతుందన్న అంచనాలున్నాయి.
iPhone
SE 4
apple
specifications
leak

More Telugu News