Hansika motwani: హన్సికకు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ

Hansika gets engaged to Sohael Khaturiya Anushka Shetty to PV Sindhu celebs wish the couple
  • ఈఫిల్ టవర్ ముందు ప్రపోజ్ చేసుకున్న హన్సిక, సొహైల్ ఖతూరియా
  • డిసెంబర్ 4న జోధ్ పూర్ ప్యాలస్ లో వీరి వివాహం
  • అనుష్క, శ్రియారెడ్డి, పీవీ సింధు తదితరుల శుభాకాంక్షలు
బాలీవుడ్ తో పాటు, దక్షిణాదిన ఎన్నో చిత్రాల్లో నటించిన హన్సిక మోత్వానీ, ఎట్టకేలకు తన పెళ్లి కబురు చెప్పింది. తన స్నేహితుడైన సోహైల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. ఈఫిల్ టవర్ ముందు సొహైల్ తనకు ప్రపోజ్ చేస్తుండగా, హన్సిక విరగబడి నవ్వుతున్న ఫొటోను షేర్ చేసింది. ఇక అంతే.. దీన్ని చూసిన ఇతర సెలబ్రిటీలు హన్సికకు పోటీ పడి మరీ శుభాకాంక్షలు చెబుతున్నారు.

అనుష్కశెట్టి, ఖుష్బూ, శ్రియారెడ్డి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తదితరులు హన్సికకు, ఇన్ స్టా గ్రామ్ కామెంట్స్ సెక్షన్ లో శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్ లోని జైపూర్ మండోట కోట ప్యాలస్ లో వివాహం ఉంటుందని సమాచారం. డిసెంబర్ 2 నుంచే వీరి వివాహ వేడుక సంబరాలు మొదలు కానున్నాయి. కొద్ది మంది అతిథుల సమక్షంలోనే అంటూ ముందు వార్తలు రాగా, వేడుక ఘనంగా ఉంటుందని తాజా సమాచారం. 
Hansika motwani
engaged
boy friend
Sohael Khaturiya
wishes
celebrities

More Telugu News