రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సీనియర్ నటి పూజాభట్
- యువ నేతతో కలిసి కొద్ది దూరం నడిచిన నటి
- సెలబ్రిటీలను భాగం చేయడం ద్వారా యాత్రకు ప్రజాదరణ
- వ్యూహాల అమలులో చురుగ్గా కాంగ్రెస్ పార్టీ
బుధవారం ఉదయం హైదరాబాద్ నగర పరిధిలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రలోకి బాలీవుడ్ సీనియర్ నటి పూజా భట్ కూడా చేరిపోయింది. రాహుల్ తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచింది. ‘‘ప్రతి రోజూ కొత్త చరిత్ర లిఖితమవుతోంది. రోజురోజుకీ దేశంలో ప్రజల ప్రేమ పెరిగిపోతోంది’’ అంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఫొటోలు, వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో పబ్లిష్ చేసింది. రాహుల్ యాత్రకు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతుగా ప్రకటనలు చేయడం విశేషం.