Shakib Al Hasan: వరల్డ్ కప్ నెగ్గేందుకే భారత్ ఇక్కడికి వచ్చింది... వాళ్లపై మేం గెలిస్తే సంచలనమే: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్

  • ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్
  • రేపు టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్
  • టోర్నీలో అవకాశాలపై షకీబల్ వ్యాఖ్యలు
Bangladesh captain Shakib Al Hasan opines on match against Team India

ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో రేపు (నవంబరు 2) టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-12 దశలో ఈ రెండు ఆసియా జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. 

ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ టోర్నమెంట్ గెలిచేందుకే వచ్చామని చెప్పలేనని, కానీ టీమిండియా మాత్రం కప్ గెలవాలన్న లక్ష్యంతోనే వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో తాము భారత్ పై గెలిస్తే అదొక సంచలనం అవుతుందని పేర్కొన్నాడు. 

ఇప్పటికే ఈ టోర్నీలో ఐర్లాండ్, జింబాబ్వే వంటి జట్లు... ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి పెద్ద జట్లను ఓడించడం చూశామని షకీబల్ వెల్లడించాడు. బంగ్లాదేశ్ కూడా ఇదే రీతిలో ఆడి బలమైన భారత్, పాకిస్థాన్ జట్లను ఓడించగలిగితే సంతోషిస్తానని తెలిపాడు. 

భారత్ తో మ్యాచ్ కు స్టేడియం నిండిపోవడం ఖాయమని, ప్రపంచంలో భారత్ ఎక్కడ ఆడినా వారికి విశేష రీతిలో మద్దతు లభిస్తుందని షకీబల్ వివరించాడు.

More Telugu News