Narendra Modi: మోర్బీలో తీగల వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

  • మోర్బీలో మచ్చూ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి
  • 134 మంది దుర్మరణం
  • మోర్బీలో పర్యటించిన మోదీ
  • ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
  • గుజరాత్ సీఎం, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
Modi visits cable bridge incident site in Morbi

గుజరాత్ లోని మోర్బీలో మచ్చూ నదిపై ఓ తీగల వంతెన కూలిపోయిన ఘటనలో 134 మంది మరణించడం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో, మోదీ నేడు గుజరాత్ పర్యటనకు వచ్చారు. మోర్బీలో తీగల వంతెన కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, సంఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

అనంతరం, ఈ ప్రమాదంలో గాయపడి మోర్బీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆపై, గుజరాత్ ముఖ్యమంత్రి, అధికారులతో మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మోర్బీ వంతెన ప్రమాదంపై సమీక్ష చేపట్టారు.

More Telugu News