Aditya Thakckeray: దేవేంద్ర ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన ఆదిత్య థాకరే

  • ఎయిర్ బస్ ప్రాజెక్టు గుజరాత్ కు ఎందుకు వెళ్లిందని ఆదిత్య ప్రశ్న
  • కేంద్రం స్వార్థపూరిత నిర్ణయం వల్ల వెళ్లిపోయిందని విమర్శ
  • రాష్ట్ర ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని వ్యాఖ్య
Aditya Thackerays challenge to Devendra Fadnavis

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కుమారుడు, రాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. ఎయిర్ బస్ ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుకూలం కాదని టాటా సంస్థకు చెందిన ఏ అధికారి చెప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్వార్థపూరితమైన నిర్ణయం మేరకే ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు తరలిపోయిందని మండిపడ్డారు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల వేల కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు వెళ్లిపోయిందని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఎయిర్ బస్ ప్రాజెక్టును టాటా సంస్థ గుజరాత్ కు తరలించినట్టు తమకు విశ్వనీయ సమాచారం ఉందని తెలిపారు. అంతేకాదు, ఈ విషయంపై ముఖాముఖి చర్చకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వస్తారా? అని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి పెట్టుబడి కూడా అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తప్పు చేశారని కానీ, మహారాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని కానీ తాను చెప్పడం లేదని.. అయితే, రాష్ట్ర ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని తాను చెపుతున్నానని అన్నారు.

More Telugu News