బరువు ఎంత తేలిగ్గా తగ్గొచ్చో చేసి చూపించిన అష్నీర్ గ్రోవర్

  • 10 కిలోల బరువు తగ్గి స్లిమ్ గా మారిన వ్యాపారవేత్త
  • సాయంత్రం పానీ పూరి తినటానికి బదులు వ్యాయామాలతో సాధన
  • క్రమశిక్షణ, సంకల్పంతో సాధించినట్టు వెల్లడి
Shark Tank Indias Ashneer Grover loses 10 kg shares 2 weight loss tips

బిజినెస్ రియాలిటీ షో ‘షార్క్ టాంక్’ న్యాయ నిర్ణేతల్లో ఒకరు, భారత్ పే వ్యవస్థాపకుల్లో ఒకరైన అష్నీర్ గ్రోవర్ గురించి తెలిసే ఉంటుంది. గతంలో ఆయన్ను చూసిన వారు, ఇప్పుడు మళ్లీ ఓసారి చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటారా? ఆయన ఇప్పుడు సూపర్ స్లిమ్ గా మారిపోయారు. అదనపు బరువు తగ్గించుకుని, నాజూగ్గా మారిన గ్రోవర్.. క్రమశిక్షణ, సంకల్పం తనను దీన్ని సాధించేలా చేసినట్టు చెప్పారు.

తన తాజా ఫొటోను ఆయన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి, 10 కిలోల బరువు తగ్గినట్టు ప్రకటించారు. నిజానికి గ్రోవర్ ఇప్పటికిప్పుడే బరువు తగ్గిపోలేదు. ఈ ఏడాది జూన్ లోనూ ఆయన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కొన్ని అంగుళాల పొట్టను, కిలోల బరువును తగ్గించుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, మైళ్ల కొద్దీ నడవడం చేస్తున్నట్లు తెలిపారు.

రోజూ సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయాన్ని, ఇప్పుడు జిమ్ లో కసరత్తులకు ఖర్చు చేస్తున్నట్టు గ్రోవర్ వెల్లడించారు. సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పానీ పూరీ తినే తాను, ఇప్పుడు అదే సమయంలో వ్యాయామాలు చేస్తున్నట్టు తెలిపారు. నడక, వ్యాయామాలు, మితాహారం ఇవన్నీ బరువును తగ్గిస్తాయని వైద్యులు సైతం సూచిస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారు ముందుగా చేయాల్సినవి ఇవే.

More Telugu News