Cricketer: క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉన్న భవనంలో అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో

Pune building that houses cricketer Zaheer Khans restaurant catches fire
  •  పూణెలో ఉన్న భవనం ఏడో అంతస్తులో చెలరేగిన మంటలు
  • ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం
  • మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది
 పూణెలో భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉన్న ఓ భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని లుల్లా నగర్ చౌక్‌లో ఉన్న మార్వెల్ విస్టా భవనం పై అంతస్తులో ఉదయం 8.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో పై అంతస్తు కిటికీలు, ఇతర వస్తువులు కిందపడ్డాయి. అయితే, ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 

ఏడు అంతస్తుల భవనంలోని పై ఫ్లోర్లో మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, మంటలను అందుపులోకి తెచ్చారు. ఈ  ప్రమాదం కారణంగా ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేయాల్సి ఉంది. కాగా, ఈ ప్రమాదం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జహీర్ ఖాన్ రెస్టారెంటుకు ఏదైనా నష్టం వాటిల్లిందో లేదో తెలియాల్సి ఉంది.
Cricketer
zheer khan
restaurant
Fire Accident
pune

More Telugu News