తాడోబా అభయారణ్యంలో మరో మూడు పిల్లలకు జన్మనిచ్చిన ‘జూనాబాయి’
- సంతతిని పెంచుకుంటూ పోతున్న పులి జూనాబాయి
- ఇప్పటి వరకు 17 పిల్లలకు జన్మనిచ్చిన వైనం
- ‘జూనాబాయి’పై సచిన్‌కు చెప్పలేనంత మమకారం
పులులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన తాడోబా అభయారణ్యంలో జూనాబాయి కాకుండా మత్కనూరు, మోగ్లీ తదితర పేర్లున్న పులులు కూడా ఉన్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరచూ ఈ అభయారణ్యాన్ని సందర్శిస్తూ ఉంటాడు. ఇక్కడికొచ్చినప్పుడు సచిన్ జూనాబాయిని చూడకుండా వెళ్లడు. అదంటే సచిన్‌కు అంత ఇష్టం మరి. గతేడాది ఈ అభయారణ్యాన్ని సందర్శించిన సచిన్‌కు రెండురోజులపాటు జూనాబాయి కనిపించలేదు. దీంతో మరో రోజు ఉండి దానిని చూశాకే అక్కడి నుంచి వెళ్లినట్టు అటవీ అధికారులు అప్పట్లో తెలిపారు.