CPI Narayana: అమెరికా విమానాశ్రయంలో సీపీఐ నారాయణను అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు

Immigration officials stops CPI Narayana at Florida Airport
  • కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన నారాయణ
  • హవానా నుంచి పెరూ వెళ్తూ ఫ్లోరిడాలో దిగిన సీపీఐ నేత
  • అమెరికా వీసా ఉన్నా విచారణ కోసం ఆపేసిన అధికారులు
కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను ఫ్లోరిడా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పార్టీ సమావేశాల అనంతరం క్యూబా రాజధాని హవానా నుంచి పెరూ వెళ్తూ మార్గమధ్యంలో ఫ్లోరిడాలో నారాయణ ఆగారు. 

అక్కడ ఆయనను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నారాయణ వద్ద అమెరికా వీసా ఉన్నప్పటికీ ముందుకెళ్లకుండా విచారణ నిమిత్తం ఆపివేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
CPI Narayana
Cuba
Florida

More Telugu News