ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలును వాయిదా వేసిన ప్రభుత్వం
- విశాఖ పర్యటన సందర్భంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని ప్రస్తావించిన జగన్
- నవంబర్ 1 నుంచే నిషేధం అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
- ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు వాయిదా వేయాలంటూ ఫ్లెక్సీల తయారీదారుల వినతి
- జనవరి 26 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు చేయనున్నట్లు తాజా ఉత్తర్వులు
అయితే, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలుకు ఒక్క రోజు ముందుగా సోమవారం (అక్టోబర్ 31) ఈ వ్యవహారంపై ఓ కీలక నిర్ణయన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారుల వినతి మేరకు నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.