Tirumala: నేటి నుంచే తిరుమల సర్వదర్శన టోకెన్ల జారీ... వివరాలివిగో

  • అలిపిరి వద్ద సర్వదర్శన టోకెన్ల పంపిణీ
  • భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్ల పంపిణీ
  • శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్ల జారీ
  • మిగిలిన రోజుల్లో 15 వేల సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తామన్న ధర్మారెడ్డి
  • టోకెన్లు లేని వారు కూడా స్వామి వారి దర్శనానికి వెళ్లొచ్చని సలహా 
ttd eo says sarva darshanam tokens will be issued from today midnight

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు కొత్తగా అందుబాటులోకి రానున్న సర్వదర్శన టోకెన్ల జారీ నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ప్రత్యేక దర్శన టికెట్ల కొనుగోలుదారులకు మాదిరిగానే గతంలో సర్వ దర్శనం భక్తులకూ టోకెన్లను జారీ చేసేవారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా కాలం క్రితమే సర్వదర్శన టోకెన్ల జారీ నిలిచిపోయింది. తాజాగా సర్వదర్శన టోకెన్లనూ జారీ చేయాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సర్వదర్శన టోకెన్ల జారీని సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది 

సర్వదర్శన టోకెన్ల జారీని సోమవారం అర్ధరాత్రి తర్వాత అలిపిరిలో జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలిపిరితో పాటు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ సర్వదర్శన టోకెన్లను పంపిణీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఇకపై ప్రతి వారం శని, ఆది, సోమ వారాల్లో 25 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు... మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లను జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. నిర్ణీత సంఖ్యలో జారీ చేసే టోకెన్ల పంపిణీ ముగియగానే... కౌంటర్లను మూసివేస్తామన్న ఆయన... టోకెన్లు లేని వారు కూడా నేరుగా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

More Telugu News