Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 787 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 225 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల నేపథ్యంలో మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. సెన్సెక్స్ మరోసారి 60 వేల మార్కును దాటింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 18,012కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (4.18%), హెచ్డీఎఫ్సీ (2.89%), సన్ ఫార్మా (2.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.60%). 

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.66%), ఎన్టీపీసీ (-0.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.43%).

More Telugu News