Hyderabad: హైదరాబాదు పబ్ లలో మ్యూజిక్ బంద్ పై గతంలో ఇచ్చిన తీర్పును సవరించిన హైకోర్టు

ts high court says music restrictions applicable for pubs which are in jubleehills limits
  • హైదరాబాద్ పబ్ లలో రాత్రి 10 గంటలు దాటితే మ్యూజిక్ బంద్ చేయాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్
  • సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంజ్ అసోసియేషన్ లు
  • సింగిల్ బెంచ్ తీర్పును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డివిజన్ బెంచ్
  • 10 గంటల తర్వాత మ్యూజిక్ బంద్ నిబంధన జూబ్లీహిల్స్ పరిధి పబ్ లకేనని వెల్లడి
  • హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల పబ్ లకు ఈ నిబంధన వర్తించదని తీర్పు
హైదరాబాద్ లోని పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను బంద్ చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సవరించింది. ఈ నిబంధన జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్ లకు మాత్రమే పరిమితమని హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా సోమవారం తీర్పు చెప్పింది. జూబ్లీహిల్స్ పరిధిలోని 10 పబ్ లు మాత్రమే రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ మినహా నగర పరిధిలోని ఇతర పబ్ లకు ఈ నిబంధన వర్తించదని హైకోర్టు తెలిపింది.

హైదరాబాద్ పరిధిలోని పబ్ లలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ ను నిలిపివేయాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంజ్ అసోసియేషన్ లు హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్... సింగిల్ బెంబ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ తీర్పు చెప్పింది.
Hyderabad
Pub
TS High Court
Telangana

More Telugu News