పబ్ లో అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసిన రాంగోపాల్ వర్మ... స్వయంగా వీడియో పోస్ట్ చేసిన దర్శకుడు

  • ఆదివారం రాత్రి ప్రిజమ్ పబ్ కు వెళ్లిన రాంగోపాల్ వర్మ
  • పబ్ లో హోరెత్తే సంగీతానికి స్టెప్పులు 
  • రాత్రి 10 తర్వాత మ్యూజిక్ బ్యాన్ పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు
director ramgopal varma enjoys in pub in hyderabad

సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగానే మారుతోంది. హైదరాబాద్ లో పబ్ లలో రాత్రి 10 గంటలు దాటితే మ్యూజిక్ బంద్ చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్పందించిన వర్మ... అసలు వరల్డ్ క్లాస్ సిటీగా మారిన హైదరాబాద్ లో ఈ తరహా ఆంక్షలేమిటని ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రాత్రి ఆయన నగరంలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లారు. 

పబ్ లో హోరెత్తే సంగీతానికి ఆయన స్టెప్పులు వేశారు. ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రిజమ్ పబ్ పన్ లో తాను పాలుపంచుకున్నానంటూ ఆ వీడియోకు ఆయన ఓ కామెంట్ ను జత చేశారు.

More Telugu News