WhatsApp: వాట్సాప్ లో ‘సెల్ఫ్ చాట్’

  • మీ నంబర్ కు మీ నుంచే సందేశం
  • నచ్చిన ఫైల్స్ ను పంపించుకోవచ్చు
  • ఐవోఎస్, ఆండ్రాయిడ్ పై మొదలైన బీటా టెస్టింగ్
WhatsApp will soon rollout a self chat feature here is how it looks

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడంలో ముందుంటుంది. ఇందుకోసం కంపెనీ సాంకేతిక నిపుణులు కొత్త ఫీచర్ల అభివృద్ధిపై పనిచేస్తుంటారు. ఇందులో భాగంగా సెల్ఫ్ చాట్ ఫీచర్ ను వారు అభివృద్ది చేశారు. ఎవరికి వారే మెస్సేజ్ చేసుకునే ఈ ఫీచర్ పై ఐవోఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో బీటా టెస్టింగ్ మొదలైందని వాబీటాఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం బీటా టెస్టర్లకే ఇది అందుబాటులో ఉంది.


ఈ ఫీచర్ లో భాగంగా మన నంబర్ కు మనమే మెస్సేజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికోసం ప్రత్యేకంగా చాట్ విండో ఉండదు. వాట్సాప్ లో మన సొంత నంబర్ ను సెలక్ట్ చేసుకున్నప్పుడు పర్సనల్ చాట్ బాక్స్ కనిపిస్తుంది. వాట్సాప్ కాంటాక్ట్ జాబితాలో మన ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది. దీంతో సెల్ఫ్ చాట్ చేసుకోవచ్చు. నచ్చిన మీడియా ఫైల్స్ ను తమ నంబర్ కే పంపించి సేవ్ చేసుకోవచ్చు.

More Telugu News