Tulasi Reddy: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతోనైనా ప్రజలు జగన్ నిజస్వరూపాన్ని గుర్తించాలి: తులసిరెడ్డి

  • జగన్ పదవీకాంక్షకు సహకరించడం తప్పని పీకే చెప్పారన్న తులసిరెడ్డి
  • స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపణ
  • జగన్ పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని వ్యాఖ్య
With Prashant Kishore comments people should recognize Jagans true nature says Tulasi Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు సాయపడటం కన్నా... కాంగ్రెస్ పునరుజ్జీవానికి తాను కృషి చేసి ఉంటే బాగుండేది అని పీకే అన్నారు. అసలైన ‘మహాత్మాగాంధీ కాంగ్రెస్’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు ఆలస్యంగా అర్థమైందన్నారు. 

ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ సీనియన్ నేత తులసిరెడ్డి స్పందిస్తూ... గాంధీ కాంగ్రెస్ తోనే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని ప్రశాంత్ కిశోర్ చెప్పడం మంచి పరిణామమని అన్నారు. గత ఎన్నికల్లో జగన్ పదవీకాంక్షకు సహకరించడం తప్పని... దీని బదులు కాంగ్రెస్ పునరుజ్జీవానికి కృషి చేస్తే బాగుండేదని అన్నారని తెలిపారు. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతోనైనా ఏపీ ప్రజలందరూ జగన్ నిజస్వరూపాన్ని, కాంగ్రెస్ ఆవశ్యకతను గుర్తించాలని చెప్పారు.

రైతుల వ్యసాయానికి స్మార్ట్ మీటర్ల కోనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒక్కో స్మార్ట్ మీటర్ కొనుగోలు, నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం రూ. 12,500 ఖర్చు చేస్తోందని... ఇదే సమయంలో ఒక్కో స్మార్ట్ మీటర్ పై ఏపీ ప్రభుత్వం రూ. 35 వేలను ఖర్చు చేయాలనుకోవడాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. జగన్ పాలనలో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయిందని చెప్పారు.

More Telugu News