గుజరాత్ వంతెన కూలిన ఘటనలో.. బీజేపీ ఎంపీ కుటుంబీకులు 12 మంది మృతి!
- తీగల వంతెన కూలిన ఘటనలో 141 మంది మృతి
- బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ ఇంట్లో విషాదం
- చిన్నారులు కూడా చనిపోయారని మోహన్ భాయ్ ఆవేదన
ఈ విషాదంపై మోహన్ భాయ్ మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో తాను 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దీనికి కారణమైన వారిని శిక్షిస్తామని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం కలచివేస్తోందని అన్నారు.