West Bengal: సోదరుడితో వివాహేతర సంబంధం.. తన భార్యను అతడికిచ్చి వివాహం చేసిన భర్త

Man arranges marriage his wife with his brother in westbengal nadia dist
  • పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘటన
  • దంపతులకు 24 ఏళ్ల క్రితం వివాహం
  • వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్న భర్త
  • తన సోదరుడితో కలిసి ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
  • గ్రామస్థుల సమక్షంలో వారిద్దరికీ వివాహం
సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్యను అతడికే ఇచ్చి పెళ్లి చేశాడో భర్త. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగిందీ ఘటన. శాంతిపూర్‌కు చెందిన అమూల్య దేబ్‌నాథ్, బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలికి 24 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి కూడా వివాహమైంది. వృత్తిరీత్యా అమూల్య దేబ్‌నాథ్ వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. 

ఈ క్రమంలో దీపాలి తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సోదరుడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న అమూల్య వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని గ్రామస్థుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆమెతో ఇక కాపురం చేయడం తన వల్ల కాదని తేల్చిచెప్పాడు. గ్రామస్థుల సమక్షంలోనే తన భార్యను సోదరుడు కిశబ్‌కు ఇచ్చి వివాహం చేశాడు.
West Bengal
Nadia
Marriage

More Telugu News