Emcet 2022: ఎంసెట్ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ఇదే!

  • ప్రైవేటు కాలేజీల వెబ్ సైట్లలో దరఖాస్తు చేసుకోండి..
  • అక్టోబర్ 31న ఇంటర్నల్ స్లయిడింగ్ నిర్వహణ
  • ఆపై మిగిలిన సీట్లకు నవంబర్ 3 వరకు స్పాట్
  • విద్యార్థులకు ఉన్నత విద్యామండలి సూచన
emcet spot schedule released

ఎంసెట్ స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్ పొందేందుకు ప్రైవేటు కాలేజీల అధికారిక వెబ్ సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్నల్ స్లైడింగ్ ఈ నెల 31న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్ల భర్తీ కోసం వచ్చే నెల 3 వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారు. కాగా, ఈ నెల 25 తో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే! ఇందులో 63,899 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.. ఇంజనీరింగ్ కోర్సులో రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో మొత్తం 79,346 సీట్లు ఉండగా అందులో 15,447 సీట్లు మిగిలిపోయాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి..
స్పాట్ కు హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలని అధికార వర్గాలు తెలిపాయి. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన విద్యార్థులను స్పాట్ అడ్మిషన్ కు అనుమతించబోమని అధికారులు తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరీశీలన కోసం తీసుకుంటామని, ఆ తర్వాత విద్యార్థి చేరిన కాలేజీకి పంపిస్తామని వివరించారు.

More Telugu News