Samantha: దేవుడు ఎప్పుడూ బాధించడు... సమంతకు మయోసైటిస్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందన

BJP leader Vishnu Vardhan Reddy reacts to Samantha Myositis revelation
  • తాను మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు సమంత వెల్లడి
  • సమంత పట్ల సర్వత్రా సానుభూతి
  • త్వరగా కోలుకోవాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • మయోసైటిస్ ను తప్పక ఓడిస్తావంటూ ట్వీట్
ప్రముఖ హీరోయిన్ సమంత ప్రమాదకర రుగ్మత మయోసైటిస్ బారినపడడం తెలిసిందే. తనకు కొన్నినెలల కిందటే మయోసైటిస్ నిర్ధారణ అయిందని సమంత సోషల్ మీడియాలో వెల్లడించడం కలకలం రేపింది. 

దీనిపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. "సమంత... నువ్వు ఎంతో దృఢమైనదానివి. మయోసైటిస్ ను తప్పక ఓడిస్తావు. దేవుడు ఎప్పుడూ బాధపెట్టడు" అంటూ ఓదార్పు వచనాలు పలికారు. 

అటు, జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. 

నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత శక్తిమంతురాలివై మళ్లీ వస్తావని సమంతకు ధైర్యం చెప్పారు.
Samantha
Myositis
Vishnu Vardhan Reddy
Tollywood

More Telugu News