Samantha: నేను 'మయోసైటిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా: సమంత

Iam suffering from Myositis decease says Samantha
  • ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానన్న సమంత
  • వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని వెల్లడి
  • కోలుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ రోజులే పట్టేటట్టు ఉందన్న సామ్
సమంత అనారోగ్యంతో బాధపడుతోందని... అమెరికాలో చికిత్స పొందుతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సమంత స్పందించింది. తాను అరుదైన 'మయోసైటిస్' అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. 

ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని... ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమంత తెలిపింది. అయితే, పూర్తిగా కోలుకోవడానికి తాను ఊహించిన దాని కంటే ఎక్కువ కాలమే పట్టేటట్టు ఉందని చెప్పింది. తాను త్వరగానే కోలుకుంటానని డాక్టర్లు కూడా నమ్మకంతో ఉన్నారని తెలిపింది. తన జీవితంలో మానసికంగా, శారీరకంగా మంచి రోజులతో పాటు చెడు రోజులను కూడా చూశానని.. అలాంటి పరిస్థితులను మళ్లీ భరించలేనేమో అని అనుకున్నానని... అయితే ఆ క్షణాలు గడిచిపోయానని... పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పింది. 

తన తాజా చిత్రం 'యశోద'కు సమంత డబ్బింగ్ చెప్పింది. ఈ సందర్భంగా చేతికి సెలైన్ ఉండటం గమనార్హం. ఒకవైపు చికిత్స పొందుతూనే, మరోవైపు సినిమా పూర్తి చేసేందుకు ఆమె ప్రయత్నించడం అభినందించదగ్గ విషయం. డబ్బింగ్ చెపుతున్న ఫొటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Samantha
Health
Tollywood
Bollywood
Yashoda

More Telugu News