KTR: సాయం కోరిన పేద క్రీడాకారిణికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్

Minister KTR stood by the poor athlete who asked for help
  • ఫెన్సింగ్ లో రాణిస్తున్న నల్గొండ జిల్లా క్రీడాకారిణి నజియా
  • ఆర్థిక సాయం చేయాలని ట్విట్టర్లో కేటీఆర్ కు విజ్ఞప్తి  
  • మంత్రి ఆదేశాలతో ఆమెకు నగదు, స్పోర్ట్స్ కిట్ అందజేసిన టీఆర్ ఎస్ నేతలు
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ట్విట్టర్లో తనను సాయం కోరిన ఓ పేద క్రీడాకారిణికి అండగా నిలిచారు. నల్గొండ జిల్లా చండూర్ మండలం బంగారి గడ్డ గ్రామానికి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి నజియా ఆటలో రాణిస్తోంది. హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాల హకీంపేట్ లో ఇంటర్ పూర్తి చేసిన 17 ఏళ్ల నజియా ఇటీవల లండన్ లో జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ లో కాంస్య పతకం, టీమ్ విభాగంలో మరో కాంస్యం గెలిచింది. 

నజియా తండ్రి ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నాడు. చిన్న జీతంతో ముగ్గురు పిల్లలను పోషించడం ఆయనకు కష్టం అవుతోంది. ఈ విషయం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన నదియా తనకు ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీనికి కేటీఆర్ స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నజియా ఇంటికి వెళ్లి స్పోర్ట్స్ కిట్ ను, రూ. 50 వేల నగదును అందించారు.
KTR
help
poor
player
Telangana
Nalgonda District

More Telugu News