పైలట్ రోహిత్ రెడ్డికి భద్రతను పెంచిన తెలంగాణ ప్రభుత్వం

  • ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరిగాయనే కేసు
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్
  • రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు
TS Govt increases security to Pilot Rohith Reddy

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగాయనే కేసు తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ కేసులో తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆపరేషన్ లో ఆయనే కీలకంగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చారు. ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. 4 ప్లస్ 4 భద్రతను కల్పించారు. మరోవైపు ఈ కేసులో ముగ్గురు నిందితులను రిమాండ్ కు పంపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More Telugu News