Anand Mahindra: దుబాయిలో అద్భుత హిందూ ఆలయం.. ఆనంద్ మహీంద్రా సందర్శన

Anand Mahindra visits newly opened magnificent Hindu temple in Dubai
  • ఈ నెల 5న ప్రారంభమైన దేవాలయం
  • 28వ తేదీన సందర్శించుకున్న ఆనంద్ మహీంద్రా
  • ట్విట్టర్ లో ఫొటో షేర్
ఇస్లామిక్ దేశం యూఏఈలోని ప్రముఖ నగరం దుబాయిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో తన అనుచరులతో పంచుకున్నారు. 

‘‘దుబాయిలోని జెబెల్ అలీలో అద్భుతంగా నిర్మించి, నిర్వహించబడుతున్న కొత్త ఆలయాన్ని నేను సందర్శించుకున్నాను. అక్కడ షిర్డీ సాయిబాబా విగ్రహం కూడా ఉంది’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. వీలు చేసుకుని మస్కట్ లో ఉన్న రెండు ఆలయాలను కూడా చూసి రండి అంటూ కామెంట్ చేశాడు. 

నిజానికి దుబాయిలోని ఈ నూతన ఆలయం ఈ నెల 5న ప్రారంభమైంది. అదే రోజు ఆనంద్ మహీంద్రా నూతన ఆలయం వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం గమనార్హం. తదుపరి దుబాయి ట్రిప్ లో తప్పకుండా దర్శించుకుంటానని ఆయన చెప్పారు. చెప్పినట్టే 25 రోజలకే ఆయన ఆలయాన్ని సందర్శించడం కూడా పూర్తి చేశారు.
Anand Mahindra
visits
Dubai
Hindu temple
magnificent

More Telugu News