Andhra Pradesh: సీబీఐ కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి... ఓఎంసీ కేసులో నిందితులపై అభియోగాల నమోదు

gali janardhan reddy and ts minister sabitha indra reddy attends cbi court in omc case
  • నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న ఓఎంసీ కేసు
  • గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిపై అభియోగాల నమోదు
  • హైకోర్టు స్టే కారణంగా శ్రీలక్ష్మీపై అభియోగాల నమోదు వాయిదా
  • నవంబర్ 11 నుంచి సాక్షుల విచారణ మొదలుపెట్టాలని కోర్టు నిర్ణయం
ఓబుళాపురం అక్రమ గనుల తవ్వకాల (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ మినహా... ఈ కేసులోని నిందితులందరిపైనా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ అభియోగాలపై నవంబర్ 11 నుంచి సాక్షుల విచారణను చేపట్టాలని కూడా కోర్టు నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా శ్రీలక్ష్మీపై అభియోగాల నమోదును సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులో .ప్రధాన నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు... ప్రస్తుతం తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న సబితా ఇంద్రారెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి,  రిటైర్డ్ అధికారులు కృపానందం, వీడి రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, అలీఖాన్ తదితరులపై కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీరంతా శుక్రవారం నాటి కోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు.
Andhra Pradesh
Telangana
TS High Court
CBI
Gali Janardhan Reddy
Sabitha Indra Reddy

More Telugu News