Gorantla Madhav: చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వాడికి ఉరిశిక్ష విధించాలి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

MP Gorantla Madhav demands death sentence for the man who sexually assaulted school girl in Hyderabad
  • హైదరాబాద్ డీఏవీ స్కూల్ లో చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడి
  • తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఘటన
  • దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలన్న మాధవ్
హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని... వాడికి ఉరిశిక్షే సరైనదని ఆయన అన్నారు. ఈ ఘటనలో నిందితుడికి శిక్ష విధించే క్రమంలో అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని కితాబునిచ్చారు.
Gorantla Madhav
YSRCP
Hyderabad
DAV School
Girl
Sexual Assault

More Telugu News