Malobika Banerjee: అప్పుడు నేను హిందీలో మాట్లాడితే విజయ్ దేవరకొండకు అర్థమయ్యేది కాదు: బెంగాలీ నటి మాళోబిక

Bengali actress Malobika recalls moments with Vijay Devarakonda
  • గతంలో ఓ మ్యూజిక్ వీడియో చేసిన విజయ్ దేవరకొండ
  • విజయ్ కి జోడీగా నటించిన మాళోబిక బెనర్జీ
  • సెట్స్ పై తాను హిందీలోనే మాట్లాడేదాన్నని మాళోబిక వెల్లడి
  • విజయ్ కి హిందీ వచ్చేది కాదని వివరణ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గతంలో ఓ మ్యూజిక్ వీడియోలో నటించాడు. "నీ వెనకాలే నడిచి" అంటూ సాగే ఆ గీతంలో విజయ్ దేవరకొండకు జోడీగా బెంగాలీ నటి మాళోబిక బెనర్జీ నటించింది. ఈ వీడియో 2018లో వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ విజయ్ దేవరకొండ ఎంతో స్టార్ డమ్ అందుకున్నాడు. ఇటీవలే లైగర్ తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించాడు. 

ఈ నేపథ్యంలో, నాడు విజయ్ దేవరకొండతో మ్యూజిక్ వీడియోలో నటించిన మాళోబిక స్పందించింది. విజయ్ దేవరకొండ ఎంతో తపన ఉన్న నటుడు అని కొనియాడింది. కాగా, వీడియో సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో సెట్స్ పై తాను హిందీలో మాట్లాడేదాన్నని, అయితే తన హిందీ విని విజయ్ దేవరకొండ వెక్కిరించేవాడని మాళోబిక గుర్తుచేసుకుంది. 

తాను మాట్లాడే భాష కొత్తగా ఉందని, అర్థం కావడంలేదని అనేవాడని తెలిపింది. అతడికి హిందీ భాష మాట్లాడడం వచ్చేది కాదని, సెట్స్ పై తెలుగులోనే మాట్లాడేవాడని ఆమె వెల్లడించింది. పైగా తాను హిందీలో మాట్లాడితే హిబ్రూ భాషలా ఉందని హేళన చేసేవాడని వివరించింది. ఒకప్పుడు హిందీ అంటే హేళనగా మాట్లాడిన విజయ్, ఇప్పుడు హిందీలో సినిమా చేశాడని వివరించింది.
Malobika Banerjee
Vijay Devarakonda
Music Video
Tollywood
Bengali

More Telugu News