టీడీపీ నేత కుమార్తె కిడ్నీ ఆపరేషన్ కు సేకరించిన రూ.15 లక్షలు అందించిన నారా లోకేశ్
- కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన టీడీపీ కార్యకర్త కుమార్తెకు కిడ్నీ సంబంధిత వ్యాధి
- ఆపరేషన్ కు రూ.15 లక్షలు అవసరమన్న వైద్యులు
- విషయం తెలిసి నిధుల సేకరణ ప్రారంభించిన కోమటి జయరామ్
- టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో రూ.15 లక్షల సేకరణ
- నారా లోకేశ్ ద్వారా నిధులను బాధిత కుటుంబానికి అందించిన ఎన్నారై విభాగం
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ నేత మురళీకృష్ణ కుమార్తె గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యులకు చూపించగా...బాలికకు ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన కీలక నేత కోమటి జయరామ్ నిధుల సేకరణకు పూనుకున్నారు. టీడీపీ ఎన్నారై అమెరికా విభాగానికి చెందిన సభ్యుల సహకారంతో బాలిక ఆపరేషన్ కు అవసరమైన రూ.15 లక్షలను ఆయన సేకరించారు. ఈ నిధులను నారా లోకేశ్ ద్వారా టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం బాధిత బాలికకు అందజేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎన్నారై అమెరికా విభాగం ముందుంటుందని లోకేశ్ అభినందించారు.