TWS earbuds: రూ.2,000 ధరలో మంచి ఇయర్ బడ్స్ కావాలా..?

Best TWS earbuds in India under Rs 2000 check out the details and buy
  • అందుబాటు ధరల్లో ప్రముఖ కంపెనీల ఇయర్ బడ్స్
  • ఒప్పో ఎంకో 2, రియల్ మీ ఎయిర్ 3 నియో
  • వీటిల్లో టచ్ కంట్రోల్ ఫీచర్లు
వైర్డ్ ఇయర్ బడ్స్ కు బదులు ఇప్పుడు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కు ఆదరణ పెరుగుతోంది. వైర్లతో సంబంధం లేకుండా, చెవిలో ధరించేందుకు కాంపాక్ట్ గా, సౌకర్యంగా ఉండడంతో ఎక్కువ మంది వీటివైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఎక్కువ కంపెనీలు వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. పోటీ పెరగడంతో తక్కువ ధరలో నాణ్యమైన ఇయర్ బడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. రూ.2,000 బడ్జెట్ లో వ్యాల్యూ ఫర్ మనీ (పెట్టిన డబ్బుకు తగిన ఉత్పత్తి) అనిపించే కొన్ని ఇయర్ బడ్స్ ను నిపుణులు సూచిస్తున్నారు.

డిజో బడ్స్ పీ ప్రస్తుతం దీని ధర రూ.1,299. 480 ఎంఏహెచ్ బ్యాటరీతో 40 గంటల ప్లేబ్యాక్ టైమ్ తో వస్తుంది. బ్లూటూత్ 10 మీటర్ల రేంజ్ వరకు (ఫోన్ నుంచి) పనిచేస్తుంది. వ్యాల్యూమ్, కాల్స్ కంట్రోల్ ను టచ్ తో చేసుకోవచ్చు. దీనికి సిలికాన్ టిప్స్ ఉండవు.

రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 నియో
ప్రస్తుతం దీని ధర రూ.1,999. ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. 10 మీటర్ల పరిధి వరకు బ్లూటూత్ కనెక్టివిటీ రేంజ్ ఉంటుంది. ఫోన్ తో మొదటిసారి పెయిర్ చేస్తే చాలు. ఆ తర్వాత నుంచి బడ్స్ ను కేస్ నుంచి తీసిన వెంటనే ఆటోమేటిగ్గా కనెక్ట్ అయిపోతాయి. 460 ఎంఏహెచ్ బ్యాటరీతో 30 గంటల ప్లేబ్యాక్ టైమ్ తో వస్తాయి. చార్జింగ్ సమయం 2 గంటలు. వైట్, బ్లూ రంగుల్లో లభిస్తాయి.

ఒప్పో ఎంకో బడ్స్ 2 ప్రస్తుత ధర రూ.1,999. బ్లాక్ రంగులోనే లభిస్తాయి. ఎన్విరాన్ మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. వ్యాల్యూమ్ పెంచడం, తగ్గించడం, కాల్ తీసుకోవడం, కట్ చేయడం ఇలాంటివన్నీ టచ్ కంట్రోల్స్ తో చేసుకోవచ్చు.

బోట్ ఎయిర్ డోప్స్ 411 ఏఎన్ సీ ప్రస్తుతం దీని ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.2,499. ఆఫర్లు ఉపయోగించుకుంటే రూ.2,300కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. కనుక బ్యాక్ గ్రౌండ్ లో శబ్దాలు వినిపించకుండా ఇది అడ్డుకుంటుంది. 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్ కవరేజీతో వస్తుంది. టచ్ కంట్రోల్స్ తో పనిచేస్తుంది. ఇందులో 320 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 17.5 గంటల ప్లేబ్యాక్ తో వస్తుంది. 

TWS earbuds
best
budget price
Rs 2000

More Telugu News