UK: అధికారిక భవంతిని కాదని చిన్న ఫ్లాట్ కు వెళ్తున్న రిషి సునాక్

New British PM Rishi Sunak and family to move back to smaller flat above 10 Downing Street
  • డౌనింగ్ స్ట్రీట్లో మరో ఫ్లాట్ కోరిన వైనం
  • చాన్స్ లర్ గా గతంలో ఆ ఫ్లాట్ లో సంతోషంగా ఉన్నట్టు వెల్లడి
  • బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేబట్టిన సునాక్
సాధారణంగా ఏ దేశాధినేతకు అయినా ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తాయి. ఇంద్రభవనం లాంటి అధికార సౌథం కేటాయిస్తారు. అయితే, బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్ మాత్రం ఈ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా డౌనింగ్ స్ట్రీట్ లోని మరో ఫ్లాట్ (అధికారిక 10 ఫ్లాట్ కు పైన ఫ్లాట్)లోకి తన కుటుంబంతో చిన్న ఫ్లాట్ కు తిరిగి వెళ్తున్నారు. గతంలో అక్కడ చాలా సంతోషంగా జీవించినందున తిరిగి ఆ ఫ్లాట్ కే వెళ్తున్నారు. 1735 సంవత్సరం నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్ బ్రిటన్ ప్రధాన మంత్రుల అధికారిక నివాసంగా ఉంది. ఇందులో మూడు నివాసాలు ఉన్నాయి. ప్రధానమంత్రి అధికారిక నివాసం, ప్రధాని కార్యాలయం, ప్రపంచ దేశాల అతిథులను బ్రిటన్ ప్రధాని కలుసుకునే మందిరం ఉంటుంది. 

మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలతో కలిసి చిన్న ఫ్లాట్‌లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రధానులు ఛాన్సలర్ కోసం కేటాయించిన నంబర్ 11 పైన ఉన్న పెద్ద ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఇందులో నాలుగు బెడ్ రూములు ఉంటాయి. భవంతి చాలా విశాలంగా ఉంటుంది. కానీ, సునాక్ మాత్రం మూడు బెడ్ రూములు ఉన్న చిన్న ఫ్లాట్ ఎంచుకున్నారు. ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి అడిగినప్పుడు, గతంలో తాము అక్కడ చాలా సంతోషంగా ఉన్నామని ప్రధాని చెప్పారు. డౌనింగ్ స్ట్రీట్ లోపల నివాస ప్రాంతాలు, బయటికి కనిపించకుండా కాస్త దూరంగా ఉంటాయి.
UK
Prime Minister
rishi sunak
flat
10 downing street

More Telugu News