Vijay Devarakonda: సమంతపై తన అభిమానాన్ని వెల్లడించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda shares Samantha starred Yashoda movie trailer
  • సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం యశోద
  • ట్రైలర్ ను పంచుకున్న విజయ్ దేవరకొండ
  • కాలేజీ రోజుల్లో సమంత అభిమానిని అని వెల్లడి
  • ఇప్పటికీ ఆరాధిస్తుంటానంటూ ట్వీట్
అందాలభామ సమంత ప్రధానపాత్రలో యశోద చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ వీడియోను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా సమంతపై తన అభిమానాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసి అభిమానిగా మారిపోయానని, ఆమెతో ప్రేమలో పడిపోయానని తెలిపారు. సమంత ఏంచేసినా తనకు నచ్చుతుందని, ఇప్పుడామెను ఆరాధిస్తున్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. సమంత నటించిన కొత్త చిత్రం యశోద ట్రైలర్ ను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. 

కాగా, హరి-హరీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేశ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Vijay Devarakonda
Samantha
Yashoda
Trailer
Tollywood

More Telugu News