థర్మల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్
- నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- నేలటూరులో ఏపీ జెన్ కో మూడో ప్లాంట్ కు ప్రారంభోత్సవం
- విద్యుదుత్పత్తి రంగంలో మరో ముందడుగు అని సీఎం వెల్లడి
నాడు 2008లో ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య పేరును ఈ థర్మల్ స్టేషన్ కు పెట్టుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
దేశంలో ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మితమైన తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇదేనని తెలిపారు. కాగా, ఈ థర్మల్ ప్లాంట్ కోసం, కృష్ణపట్నం పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు నిండు మనసుతో శిరసు వంచి నమస్కరిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.