Nara Lokesh: జేసీబీతో తొక్కించి వృద్ధురాలిని చంపడం వైసీపీ పాలనకు పరాకాష్ట: నారా లోకేశ్

Killing an old woman by trampling with JCB is the pinnacle of YSP rule says Nara Lokesh
  • ప్రజావేదిక ధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందన్న లోకేశ్
  • ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే ప్రజల్ని బలిగొంటున్నారని ఆగ్రహం
  • కొందరు అధికారులు సుపారీ గ్యాంగుల్లా తయారయ్యారని విమర్శ
ప్రజావేదిక ధ్వంసంతో ఆరంభమైన జగన్ రెడ్డి జేసీబీ పాలన... క్రమంగా ప్రతిపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యం చేసుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే ప్రజల్ని కూడా బలిగొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జేసీబీతో తొక్కించి చంపడం వైసీపీ రాక్షస పాలనకు పరాకాష్ట అని అన్నారు. వైసీపీ నేతల ఆదేశాలతో కొంతమంది అధికారులు సుపారీ గ్యాంగుల్లా తయారయ్యారని.. వృద్ధురాలిని చంపిన అధికారులను, దీని వెనుక ఉన్న వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న నిరుపేదలకు పట్టాలివ్వాలని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Old Woman
JCB

More Telugu News