Elon Musk: ఎలాన్ మస్క్ ఇప్పుడు చీఫ్ ట్విట్.. ట్విట్టర్ కార్యాలయంలోకి వెరైటీ ఎంట్రీ

Chief Twit Elon Musk carries sink into Twitter HQ ahead of 44 billion dollars buyout deadline
  • ట్విట్టర్ ప్రధాన కార్యాలయం సందర్శన
  • 75 శాతం ఉద్యోగుల తొలగింపు ప్రణాళికేదీ లేదని స్పష్టీకరణ
  • ఒకటి రెండు రోజుల్లో కొనుగోలు పూర్తయ్యే అవకాశం
ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చివరి గడియలకు చేరుకుంది. శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ పేజీలో మస్క్ పోస్ట్ చేశారు. 

పింగాణీ సింక్ ను రెండు చేతులతో పట్టుకుని మస్క్ ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి అడుగులు వేశారు. అలా ఎందుకు చేశారన్నది తెలియదు. బహుశా అది ఆయనకు సెంటిమెంట్ అయి ఉండొచ్చు. అంతేకాదు, ట్విట్టర్ పేజీ తన ప్రొఫైల్ లో తనను చీఫ్ ట్విట్ గా సంబోధించుకున్నారు. దీన్నిబట్టి ట్విట్టర్ మస్క్ సొంతం అవుతుందని తెలుస్తోంది. 

44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకుంటున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ. 3.56 లక్షల కోట్లు. మరోవైపు ట్విట్టర్ మస్క్ సొంతం అయితే 75 శాతం మందిని తొలించనున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. 75 శాతం మందిని తొలగించే ప్రతిపాదన ఏదీ లేదని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా అక్కడి సిబ్బందితో మస్క్ చెప్పినట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది. అయినా కానీ, ఎంతో కొంత మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.
Elon Musk
twitter buy
Twitter Head quarters
visits
Chief Twit

More Telugu News