Balakrishna: బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు రోజా వస్తున్నారంటూ ప్రచారం!

Is Roja coming to Balakrishna Unstoppable
  • బుల్లితెరపై దుమ్మురేపుతున్న బాలయ్య అన్ స్టాపబుల్
  • దుమ్మురేపిన చంద్రబాబు, నారా లోకేశ్ ల ఎపిసోడ్
  • రోజాను రప్పించేందుకు అల్లు అరవింద్ యత్నిస్తున్నారని ప్రచారం
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ షో ఫస్ట్ సీజన్ దేశ వ్యాప్తంగా ఇతర షోల కంటే ఎక్కువ టీఆర్పీని సాధించింది. ఇప్పుడు రెండో సీజన్ కూడా దుమ్మురేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ తొలి ఎపిసోడ్ కు వచ్చారు. రెండో ఎపిసోడ్ కు హీరోలు సిద్దు, విశ్వక్ సేన్ లు వచ్చారు. ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. సినీ నటి, ఏపీ మంత్రి రోజా ఈ షోకు వస్తున్నారనేదే ఆ ప్రచారం. 

వాస్తవానికి బాలయ్య, రోజా ఇద్దరికీ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. అయితే, ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండటంతో వీరి మధ్య దూరం నెలకొంది. అయితే వీరిద్దరినీ కలిపేందుకు ఈ షో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవరూపం దాలిస్తే... వీరి కాంబినేషన్లో వచ్చే ఎపిసోడ్ అదిరిపోయే అవకాశం ఉంది. మరి, ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందనే విషయాన్ని వేచి చూడాలి.
Balakrishna
Roja
Unstoppable
Tollywood
Telugudesam
YSRCP

More Telugu News