Gurmeet Ram Rahim Singh: మరోసారి వార్తల్లోకెక్కిన డేరా బాబా

Gurmeet Ram Rahim Singh named his adopted daughter
  • అత్యాచారం కేసులో గతంలో జైలుపాలు
  • ఇటీవలే పెరోల్ పై బయటికొచ్చిన డేరా బాబా
  • దత్త పుత్రిక హనీప్రీత్ కు కొత్త పేరు పెట్టిన వైనం
  • ఇక నుంచి ఆమె రుహానీ దీదీ అంటూ ప్రకటన
అత్యాచారానికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో జైలుపాలైన డేరా సచ్చా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా పెరోల్ పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోర్టు ఆయనకు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. 

కాగా, తన సన్నిహితురాలు హనీ ప్రీత్ ఇన్సాన్ ను ఇప్పటికే దత్తపుత్రికగా ప్రకటించిన డేరా బాబా... తాజాగా ఆమెకు కొత్త పేరు పెట్టారు. ఇకపై ఆమె 'రుహానీ దీదీ'గా ప్రసిద్ధికెక్కుతుందని డేరా బాబా సెలవిచ్చారు. 

"మా అమ్మాయి పేరు హనీప్రీత్. ప్రతి ఒక్కరూ ఆమెను దీదీ (అక్క) అని పిలుస్తుంటారు. దాంతో ఆమె అసలు పేరు పట్ల కొంచెం గందరగోళం నెలకొంది. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా 'రుహానీ దీదీ' అని పేరు పెట్టాం. ఇప్పటితరం వాళ్లకు అనువుగా ఉండేలా 'రుహీ దా' అని కూడా పిలుచుకోవచ్చు" అని వివరించారు.
Gurmeet Ram Rahim Singh
Honeypreet
Ruhani Didi
Dera Baba

More Telugu News