ఓబుళాపురంలో పర్యటించిన ఆర్సెలర్ మిట్టర్ కంపెనీ ప్రతినిధులు

  • అనంతపురం జిల్లాలో పర్యటించిన మిట్టల్ కంపెనీ ప్రతినిధులు
  • ఓబుళాపురంలోని ఏపీఐఐసీ భూముల పరిశీలన
  • రూ.500 కోట్లతో యూనిట్ ఏర్పాటుకు మిట్టల్ కంపెనీ సంసిద్ధత 
Arcellor Mittal delegation visits apiic lands in obulapuram of ananthapur district

ప్రపంచ ఉక్కు దిగ్గజంగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీ మిట్టల్ ఏపీలో తన పరిశ్రమకు చెందిన ఓ యూనిట్ ను ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ కు చెందిన ప్రతినిధులు బుధవారం ఏపీలోని అనంతపురం జిల్లా ఓబుళాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓబుళాపురంలో ఏపీఐఐసీకి చెందిన భూములను వారు పరిశీలించారు. 

ఓబుళాపురంలోని ఏపీఐఐసీ భూముల్లో తమ కంపెనీ యూనిట్ ను నెలకొల్పేందుకు మిట్టల్ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ యూనిట్ కోసం రూ.500 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు వారితో పాటు ఓబుళాపురం వెళ్లిన ఏపీఐఐసీ చైర్మన్ డీసీ గోవింద రెడ్డి ఓ ప్రకటన చేశారు. ఓబుళాపురం పరిధిలో ఇనుప గనులు ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News