Nayanthara: నయనతార సరోగసీ చట్టబద్ధమే... తేల్చేసిన విచారణ కమిటీ

  • 2016 మార్చి 11న నయన్ పెళ్లి జరిగిందన్న కమిటీ
  • 2021 ఆగస్టులో సరోగసీ ప్రక్రియ మొదలైందని వెల్లడి
  • 2021 నవంబర్ లో అగ్రిమెంట్ చేసుకున్నారని వివరణ
  • చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలోనే సరోగసి జరిగిందన్న విచారణ కమిటీ
enquiry committe on nayanthara surrogacy gives clean chit to actress

ప్రముఖ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు కలిగిన కవల పిల్లలు చట్టబద్ధంగానే జన్మించారని తమిళనాడు విచారణ కమిటీ తేల్చి చెప్పింది. చట్టబద్ధంగానే సరోగసీ ద్వారా నయన్ దంపతులు పిల్లలను కన్నారని కూడా ఆ కమిటీ తెలిపింది. ఈ మేరకు తమిళనాడు సర్కారుకు కమిటీ తన నివేదికను బుధవారం సమర్పించింది. ఈ నివేదికలో నయన్ పెళ్లి, సరోగసీ కోసం ఆ దంపతులు చేపట్టిన చర్యలను కమిటీ కూలంకషంగా ప్రస్తావించింది.

2016 మార్చి 11న విఘ్నేశ్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా కమిటీ తెలిపింది. ఈ క్రమంలో సరోగసీ కోసం నయన్ దంపతులు 2021 ఆగస్టులో ప్రక్రియను మొదలుపెట్టారని, ఇక నిబంధనల మేరకు అదే ఏడాది నవంబర్ లో వారు సరోగసీ కోసం ఒప్పందం కూడా చేసుకున్నారని వెల్లడించింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారని కూడా కమిటీ తేల్చిచెప్పింది.

More Telugu News